నా కూతురు హీరోయిన్ కావడం ఇష్టం లేదు ! - MicTv.in - Telugu News
mictv telugu

నా కూతురు హీరోయిన్ కావడం ఇష్టం లేదు !

June 19, 2017

సారా అలీఖాన్ హీరోయిన్ అవుతుందన్న విషయమై ఆమె కన్నతండ్రి హీరో సైఫ్ అలీఖాన్ ను మీడియా ప్రశ్నిస్తే తనకు తన కూతురు సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పేసాడు. తను కుదురుగా ఏదైనా సాఫ్ట్ వేర్ జాబ్ చేస్కుంటే చూసి ఆనంద పడతానని చెప్పాడు. సైఫ్ ఒపీనియన్ మీద చాలా విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇండస్ట్రీకి బయటినుండి ఏ అమ్మాయి హీరోయిన్ గా వచ్చినా ఒప్పుకుంటారు గానీ తన సొంత కూతురు హీరోయిన్ గా వస్తానంటే ఒప్పుకోకపోవడం వెనకాల మతలబు ఏంటని ? కూతురు రాకని తిరస్కరిస్తున్న సైఫ్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ రాకని కూడా వద్దంటాడా ? అని సవాల్ విసురుతున్నరు.

‘ మనం జేస్తే కరెక్ట్ .. మనోళ్ళు జేస్తే రాంగ్ ’ అన్నట్టే ఉన్నది మన సైఫ్ అలీ ఖాన్ కథ చూస్తుంటే. తన కూతురు సారా సినిమాల్లోకి ఇగ వచ్చేస్తుంది – అగ వచ్చేస్తుందని చాలా రోజులుగా గుసగుసలు విన్పిస్తున్న మాట నిజమే. ఎట్టకేలకు సారా ‘ soty 2 ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు కన్ ఫామ్ అయింది. Soty అంటే ఏంటని ఆశ్చర్య పోకండి.. కరణ్ జోహర్ డైరెక్షన్ లో వచ్చిన ‘ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ’ సినిమా షార్ట్ ఫామ్ లో అన్నమాట.. దానికి సీక్వెల్ గా రానున్న సినిమాలో సారా హీరోయిన్. హీరో ఎవరో ఇండస్ట్రీకి సంబంధం లేని కొత్త కుర్రాడనుకునేరు.. కాదు కాదూ.. మన షాహిద్ కపూర్ కి సొంత తమ్ముడు ఇషాన్ కపూర్. అతని సరసన నటిస్తున్నది సారా.
చూడాలి మరి తండ్రికి ఇష్టం లేకుండా సారా హీరోయిన్ గా బాలీవుడ్ కు రాకుండా వుంటుందా ? తమను, అమ్మను వద్దనుకొని వెళ్ళిపోయి కరీనా కపూర్ ను రెండో పెళ్ళి చేస్కున్న తండ్రి మాటకే వాల్యూ ఇస్తుందా ?