Sarabjit Singh's wife Sukhpreet Kaur dies in road accident in Punjab
mictv telugu

రోడ్డు ప్రమాదంలో సరబ్ జిత్ సింగ్ భార్య కన్నుమూత

September 13, 2022

గూఢచారి అనే ముద్రతో 22 ఏళ్ల పాటు పాకిస్తాన్ జైలులో మగ్గి, చిత్రహింసలు అనుభవించి ఖైదీల దాడిలో మరణించిన సరబ్‌జిత్ సింగ్ దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన జీవిత కథ ఆధారంగా ఐశ్వర్యారాయ్, రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలలో బాలీవుడ్ లో ఓ సినిమా కూడా రూపొందింది. తాజాగా సరబ్‌జిత్ భార్య సుఖ్ ప్రీత్ కౌర్ తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించారు.

టూవీలర్ పై వెళుతున్న సమయంలో ఫతేహాపూర్ వద్ద వెనకాల కూర్చున్న సుఖ్ ప్రీత్ కౌర్ కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. మంగళవారం తర్న్ లోని ఆమె స్వస్థలం భిఖివిండ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలాఉంటే.. సరబ్ జిత్ సింగ్-సుఖ్ ప్రీత్ కౌర్ లకు ఇద్దరు సంతానం. జూన్ లో సరబ్ జిత్ సోదరి దల్బీర్ కౌర్ ఛాతి నొప్పితో కన్నుమూశారు. సరబ్ జిత్ విడుదల కోసం దల్బీర్ కౌర్, సుఖ్ ప్రీత్ చేసిన పోరాటం.. స్థిరస్థాయిగా గుర్తిండిపోయింది.

వ్యవసాయం చేసుకుని జీవించే సరబ్‌జిత్ సింగ్.. ఒకరోజు అనుకోకుండా సరిహద్దు దాటాడు. దీంతో పాకిస్తాన్ అధికారులు ఆయనను ఓ గూఢాచారి అని కట్టుకథలు చెప్పి జైలులో వేశారు. పాకిస్తాన్ కోర్టు ఆయనకు మరణ శిక్ష వేసింది. అయితే, ఆ శిక్షను పలుకారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు 2013, ఏప్రిల్ లో తోటి ఖైదీల చేతిలో లాహోర్ జైల్లో దాడికి గురై.. కన్నుమూశారు. మరణాంతరం ఆయన మృతదేహాన్ని అమృత్ సర్ కు తీసుకువచ్చి.. అంత్యక్రియలు నిర్వహించారు.