జమ్మి చెట్టు వివాదం.. మహిళా సర్పంచ్‌పై దాడి  - MicTv.in - Telugu News
mictv telugu

జమ్మి చెట్టు వివాదం.. మహిళా సర్పంచ్‌పై దాడి 

October 26, 2020

police

దసరా పండగ ఒక ఊరిలో వివాదానికి కారణమైంది. జమ్మి చెట్టు ఏర్పాటుపై వివాదం తలెత్తడంతో ఏకంగా మహిళా సర్పంచ్‌పై కొంత మంది దాడి చేశారు. ఈ ఘటనలో సర్పంచ్ రేణుక చేతులకు గాయాలయ్యాయి. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా  కేశంపేటలో ఆదివారం సాయంత్రం ఇది జరిగింది. దీంతో పండగ పూట గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

గ్రామ ఆనవాయితీ ప్రకారం రేణుక జమ్మి చెట్టును ఊరి అవతల పెట్టి పూజలు నిర్వహించారు. గ్రామస్తులంతా వెళ్లి పూజలో పాల్గొన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో వర్గానికి నచ్చలేదు. వారు కూడా మరో చెట్టు ఏర్పాటు చేసి తామ జమ్మిచెట్టుకు పూజ చేయడానికి రావాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఒకసారి పూజ చేసిన తర్వాత మళ్లీ చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇది రెండు వర్గాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. దాడి ఘటనపై సర్పంచ్ రేణుక  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.