అయోధ్య ఆలయంలో ఇఫ్తార్.. రాజకీయ నేతలకు నో ఎంట్రీ - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య ఆలయంలో ఇఫ్తార్.. రాజకీయ నేతలకు నో ఎంట్రీ

May 20, 2019

అయోధ్య పేరు వినగానే ఒక ఉద్రిక్తత గుర్తుకొస్తుంది. రామజన్మభూమి, బాబ్రీ మీదు కోర్టు గొడవలు, ఆగ్రహావేశాలు మనసులో మెదులుతాయి. కానీ అక్కడి జనం మాత్రం ఏ టెన్షన్ లేకుండ హాయింగా జీవిస్తున్నారు. మొన్న హోలీ పండగ రోజున అయోధ్య కేసు కక్షిదారులు పరస్పరం గులాల్ చల్లుకుని సందడి చేశారు. తాజాగా అలాంటి ఘట్టమొకటి చోటుచేసుకోనుంది.

Sarayu kunj temple in disputed ayodhya hosing iftar feast for mulims  

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలోని  సరయూ కుంజ్ ఆలయంలో ముస్లింలకు ఈ రోజు(సోమవారం) ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీమసీదు స్థలానికి దగ్గర్లోనే ఉందీ గుడి. రాజకీయ నాయకులను దీనికి ఆహ్వానించడం లేదు. కేవలం స్థానిక ముస్లింల సోదరులనే ఆహ్వానించామని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలూ లేవని ప్రధాన పూజారి మహంత్ జుగల్ కిశోర్ శరన్ శాస్త్రి చెప్పారు. గత ఏడాది కూడా తాము 500 మంది ముస్లిం సోదురులకు గుడిలో విందు ఇచ్చామన్నారు.  ఊరి ప్రజల మధ్య శాంతి, సంయమనం, సామరస్యాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయోధ్యలో ముస్లింలకు విందు ఇవ్వడం కొత్త సంప్రదాయమేమీ కాదని, గతంలో హనుమాన్‌గడీ గుడిలో విందు ఇచ్చారని గుర్తు చేశారు. కాగా, లక్నోలోని మన్‌కామేశ్వర్ ఆలయ నిర్వాహకులు కూడా గత ఏడాది ఇఫ్తార్ విందు ఇచ్చారు.