పాక్ కెప్టెన్‌కు భంగపాటు..జట్టులోకి నో ఎంట్రీ - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ కెప్టెన్‌కు భంగపాటు..జట్టులోకి నో ఎంట్రీ

October 18, 2019

Sarfaraz Ahmed Sacked As Pakistan Captain.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సర్ఫరాజ్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించింది. టెస్టు జట్టు కెప్టెన్‌గా అజహర్ అలీని, టీ20 కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ని నియమించింది. వన్డే జట్టు కెప్టెన్‌ పేరుని ఇంకా ప్రకటించలేదు.

పాకిస్థాన్ జట్టు నవంబర్ నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ మేరకు జట్టు ఎంపికపై కసరత్తు చేస్తున్న పీసీబీ మొదటగా కెప్టెన్సీని మార్పు చేసింది. సర్ఫరాజ్‌ అహ్మద్‌‌ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా.. జట్టులోకి కూడా తీసుకోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. దేశవాళీ క్రికెట్‌లో ఆడి మళ్లీ ఫామ్ నిరూపించుకోవాలని సర్ఫరాజ్‌కి సూచించింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ కోసం సోమవారం జట్టుని ప్రకటించనున్నట్లు తెలిపింది.