న్యూజిలాండ్ పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసింది. తీవ్ర ఉత్కంఠగా సాగినా మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించాయి. పాక్ విజయానికి మూడు ఓవర్లలో 15 పరుగులు అవసరం ఉండగా అంపైర్లు ఆటను వెలుతురు లేమి కారణంగా ఆటను నిలిపివేశారు. అప్పటికి పాక్ తొమ్మది వికెట్లు కోల్పోయింది. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే మిగిలింది. పాక్ బ్యాట్స్ మెన్ సర్ఫరాజ్ అహ్మాద్(118) సెంచరీతో మెరిశాడు.
When life gives you another chance, grab it like Sarfaraz Ahmed! What a player 👏 #PAKvNZ pic.twitter.com/h8icazMuwZ
— Farid Khan (@_FaridKhan) January 6, 2023
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ కూడా 408 పరుగులకు ఆలౌటైంది. . 41 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కివీస్ జట్టు 277 పరుగులు చేసి పాక్ ముందు 319 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే పాక్ 9 వికెట్ల నష్టానికి 304 పరుగులే చేయగలిగింది. ఓ దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన పాకిస్థాన్‌ను సౌద్ షకీల్‌తో కలిసి సర్ఫరాజ్ ఆదుకున్నాడు. చివరికి 118 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సర్ఫరాజ్ ఔట్ కావడంతో పాక్ ఆశలు ఆవిరయ్యాయి. చివరికి ఓటమి నుంచి తప్పించుకొని డ్రాతో గట్టెక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సర్ఫరాజ్‌కు దక్కాయి.
సర్ఫరాజ్ అహ్మద్ ఉద్వేగం
సుమారు 8 ఏళ్ల తర్వాత సెంచరీ సాధించిన సర్పరాజ్ అహ్మద్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. 98 పరుగుల వద్ద హెన్రీ బౌలింగ్‌లో రెండు పరుగులు తీయగానే ఆనందతో ఎగిరి గెంతేశాడు. మైదానంలో కూర్చొని కసితో భూమిని గుద్దాడు. అనంతరం బ్యాట్ ఎత్తి అభివాదం చేసి తర్వాత మైదానాన్ని ముద్దాడాడు. గ్యాలరీలోనూ అతడి తల్లి, దండ్రులు ఎమోషనల్ అయ్యారు. భార్య ఆనందంతో కంటతడి పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.గత కొంతకాలంగా జట్టుకి దూరమైన సర్ఫరాజ్‌కు పీసీబీ అధ్యక్షుడిగా నజం సేథీ, చీఫ్ సెలక్టర్‌గా మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీదీ నియమితులయ్యాక అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.