సరిలేరు నీకెవ్వరు.. మహేష్ గన్‌ లోడింగ్ అదుర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

సరిలేరు నీకెవ్వరు.. మహేష్ గన్‌ లోడింగ్ అదుర్స్

November 16, 2019

మహేశ్ బాబు అభిమానులకు మరో పండగలాంటి వార్త వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా నుంచి గఫీ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు గన్ లోడ్ చేసే చిత్రాన్ని దీంట్లో విడుదల చేశారు. టీజర్ త్వరలో రాబోతోంది అన్న సంకేతంగా ‘టీజర్ లోడింగ్’ అనే క్యాప్షన్ ఇచ్చి ఇక మోత మొదలు అంటూ ట్వీట్ చేశారు. తనదైన స్టైల్‌లో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా గన్ లోడ్ చేసే విధానం అందరిని ఆకట్టుకుంటోంది.

దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో విజయశాంతి మళ్లీ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ బాబు స్టైల్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రష్మీక హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకోవడంతో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నారు.