అమెజాన్ ప్రైమ్‌లో ‘సరిలేరు..’ డేట్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ ప్రైమ్‌లో ‘సరిలేరు..’ డేట్ వచ్చేసింది

February 4, 2020

Sarileru Neekevvaru.

సంక్రాంతి కానుకగా విడుదల అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వంద రోజులకు చేరువలో ఉంది. 57 రోజులకు మార్చి 7న అమెజాన్ ప్రైమ్‌‌లో ప్రదర్శితం కానుంది. మహేష్ బాబు, రష్మికా మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. 13 ఏళ్ల విరామం తర్వాత ఈ చిత్రంలో విశిష్ఠమైన పాత్రలో మెరిసిన లేడీబాస్ విజయశాంతి ఈ సినిమా విజయంలో కీలకంగా మారారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే రూ. 150కోట్ల షేర్‌తో పాటు రూ. 230 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఇంకా బాక్సాఫీస్ దగ్గర ధీమా చాటుతోంది.  అయితే ఈ సినిమాను థియేటర్‌లో చూడలేనివాళ్లు అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు. 

ఈ మధ్యకాలంలో సినిమాలకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కులు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాక సినిమా థియోటర్స్‌లో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతున్నాయి. ఈ విధంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు మంచి కాసులను కురిపిస్తున్నాయి. అయితే డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. అందుకే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు  రిలీజ్‌కు ముందు అమెజాన్‌తో ముందే ఒప్పందం చేసుకుంటున్నాయి.