గంగ‌వ్వ‌తో 'స‌రిలేరు నీకెవ్వ‌రు' టీం సందడి - MicTv.in - Telugu News
mictv telugu

గంగ‌వ్వ‌తో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ టీం సందడి

December 8, 2019

gangavva01

లేట్ వయసులో యూట్యూబ్‌ సెన్సేష‌న్‌గా మారిన ‘మై విలేజ్ షో’ గంగ‌వ్వ ఇప్పుడిపుడే సినిమాల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల ఇస్మార్ట్ శంక‌ర్, మల్లేశం తదితర చిత్రాల్లో నటించింది. యూట్యూబ్‌లో గంగవ్వకు ఉన్న ఫాలోయింగ్ చూసి ఎందరో సినీ దర్శక నిర్మాతలు మై విలేజ్ షో ద్వారా ప్రమోషన్ చేయించుకుంటున్నారు. గతంలో ఓ బేబీ, మల్లేశం ఇలా ఎన్నో సినిమాలను మై విలేజ్ షో ప్రమోషన్ చేసింది. 

తాజాగా మహేష్ బాబు నటిస్తున్న ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ చిత్ర బృందం మై విలేజ్ షో టీంతో సందడి చేసింది. మూవీ ప్ర‌మోష‌న్ కోసం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ చిత్ర బృందం మై విలేజ్ షో టీంని కలిసింది. ఇందులో మహేష్ బాబు, విజయశాంతి, రాజేంద్ర‌ప్రసాద్‌, దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలవుతున్న సంగతి తెల్సిందే.