భయపడేవాడే బేరానికి వస్తాడు.. సరిలేరు నీకెవ్వరు టీజర్ - MicTv.in - Telugu News
mictv telugu

భయపడేవాడే బేరానికి వస్తాడు.. సరిలేరు నీకెవ్వరు టీజర్

November 22, 2019

టాలీవుడ్ అగ్రకథానాయకుడు మహేశ్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు..’ హిట్ ఫార్ములాతోనే తీస్తున్నట్లు ఈ రోజు విడుదలైన టీజర్ చెబుతోంది. పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్లతో చాక్లెట్ బాయ్ అదరగొట్టాడు. సైనికుడి పాత్రలో ఒదిగిపోయిన మహేశ్..  ‘భయపడేవాడే బేరానికి వస్తాడు. మన దగ్గర బేరాల్లేవు’ అని అంటున్నాడు. ఉమన్ రెబల్ స్టార్ విజయశాంతి కూడా పంచ్ డైలాగులు వదులుతున్నారు. ‘ఇక గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు’ అని అంటున్నారు.

 ప్రకాశ్ రాజుతోనూ ఓ డైలాగ్ వదిలించారు. ‘ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడు వస్తున్నాడు..’ అని అంటాడు. ‘ఎఫ్2’తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి పక్కా హిట్ ఫార్ములాను తయారు చేసుకుని రంగంలోకి దూకతున్నట్లు తెలుతోంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 11న విడుదల కానుంది.