Sarkar good news for farmers..Increase till 13th of this month
mictv telugu

రైతన్నలకు గుడ్‌న్యూస్..ఈ నెల 13వరకు పెంపు

August 10, 2022

Sarkar good news for farmers..Increase till 13th of this month

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు కేసీఆర్ సర్కార్ ఓ శుభవార్తను చెప్పింది. రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ, అధికారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకే రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గడువు విధించింది.

అయితే, దరఖాస్తుల విషయంలో సైట్‌ తెరుచుకోడానికే మూడు రోజుల సమయం పట్టిన కారణంగా రిఫికేషన్‌తోపాటు, కొత్తగా అప్‌లోడ్‌ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఇచ్చినా గడువులోపు పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడ్డ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక, గడువు కేవలం 15 రోజులే ఇవ్వడం, గత నెలలో వర్షాలు భారీగా పడటం, అర్హులైన 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి స్థాయిలో కాలేదు. తాజా గడువు తేదీ ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు రైతు బీమా నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలని వ్యవసాయశాఖ సూచించింది. ఈ క్రమంలో మరోసారి సర్కార్ గడువు పెంచడంతో రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోనివారికి ఉరట లభించినట్లైంది.