Sarkar's warning to RMPs
mictv telugu

ఆర్ఎంపీలకు సర్కార్ వార్నింగ్..అలా చేస్తే ఉరుకోం

September 29, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో, మండల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలుగా విధులు నిర్వహిస్తున్నవారికి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు చేస్తే చూస్తూ ఉరుకోమని, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికకు గల కారణాలను బుధవారం ఆయన మీడియా ముందు వెల్లడించారు.

”రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలకు ఒక్కటే చెప్తున్నా..తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు, కొన్ని రకాల సర్జరీలు చేస్తూ, కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాదు, విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెడతాం. స్థానికంగా క్లినిక్లు పెట్టుకుని ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేస్తున్నాం” అని ఆయన అన్నారు.

మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు కొనసాగుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని, ఆస్పత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బుధవారం నాటికి అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా 2,058 ఆస్పత్రులను, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన 103 ఆస్పత్రులను సీజ్ చేశారు. 633 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 75 ఆస్పత్రులకు జరిమానాలు విధించారు. అయితే, చిన్న చిన్న లోపాలున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవద్దని, వారికి 15 రోజులపాటు సమయమిచ్చి తదనంతరం సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు.