Sarkaru Vaari Paata OTT release: When, where to watch Mahesh Babu's actioner
mictv telugu

ఓటీటీలో సర్కారు వారి పాట.. జేబుకు బొక్క..

June 2, 2022

Sarkaru Vaari Paata OTT release: When, where to watch Mahesh Babu's actioner

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకి సర్కారు వారి పాటను దక్కించుకుంది. నెల రోజుల థియేట్రికల్ రన్ తర్వాత అంటే జూన్ 10 లేదా జూన్ 24న ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని మొదట టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే ముందుగానే ఈరోజు నుంచే ప్రైమ్ వీడియో మహేశ్ సినిమాని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. పే పర్ వ్యూ రెంటల్ విధానంలోమహేష్ మూవీని అభిమానులకు అందించింది అమెజాన్ ప్రైమ్. కొద్దిరోజులు పే పర్ వ్యూ విధానంలో ఉంచి.. ఆతర్వాత సాధారణ యూజర్లకు అందుబాటులో ఉంచనుంది.

ఇటీవల కేజీఎఫ్ 2 చిత్రాన్ని కూడా ఈ విధానంలోనే ఓటీటీలో విడుదల చేశారు. కొద్ది రోజుల తర్వాత సాధారణ చందాదారులకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు సర్కారువారి పాట చిత్రానికి కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. థియేటర్స్ లో ఇంకా ఆడుతున్న ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ పామ్ పై ఎలాంటి స్పందన లభిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది. ఓటీటీకి డబ్బులు కడుతుండగా , మళ్లీ మూవీలకు డబ్బులు కట్టించుకుని జేబులకు చిల్లులు పెడతారా అని కొంతమంది యూజర్లు తిడుతున్నారు.