వసూళ్లలో రికార్డు.. చరిత్రలో మొదటి హీరోగా మహేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

వసూళ్లలో రికార్డు.. చరిత్రలో మొదటి హీరోగా మహేశ్

May 17, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన ఐదు రోజుల్లో 160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ క్రమంలో అతి వేగంగా, ఐదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా షేర్ సాధించిన తొలి ప్రాంతీయ సినిమాగా సరికొత్త రికార్డును తన పేరున లిఖించుకొంది. కీర్తి సురేష్ నాయికగా నటించిన ఈ సినిమాలో మహేశ్ నటన, ఫైట్లు మరో రేంజులో ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలో చక్కని సందేశంతో పాటు లారీ సీన్ హైలెట్ అంటూ చర్చించుకుంటున్నారు. పరశురాం దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించారు.