మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట ట్రైలర్‌ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈ క్రమంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 26 మిలియన్ల వ్యూస్ సాధించి తెలుగులో అన్ని సినిమాల గత రికార్డులను బద్ధలు కొట్టింది. లైకుల్లో కూడా రికార్డు స్థాయిలో 1.10 మిలియన్లను సాధించింది. ఇప్పటివరకు ఆ రికార్డు ప్రభాస్ రాధేశ్యామ్ పేరిట ఉంది. ఆ చిత్రానికి 23.20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఆ తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య సినిమా 21.86 మిలియన్లు, రాజమౌళి బాహుబలి (2) 21.81 మిలియన్ల వ్యూస్‌తో ఉన్నాయి. ట్రైలరే ఇలా ఉందంటే సినిమా అంతకు మించి వంద రెట్లు ఉంటుందని దర్శకుడు పరశురామ్ చెప్తున్నారు. మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలకు సిద్ధంగా ఉంది.