సరూర్‌నగర్ విషాదం.. నవీన్ మృతదేహం లభ్యం - MicTv.in - Telugu News
mictv telugu

సరూర్‌నగర్ విషాదం.. నవీన్ మృతదేహం లభ్యం

September 21, 2020

Saroor nagar naveen kumar incident

నేరెడ్‌మెట్ సుమేధ సంఘటనను మరువక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సరూర్‌నగర్‌ చెరువులోకి ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. అతడిని అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్‌(45)గా గుర్తించారు. నవీన్ సరూర్‌నగర్ నుండి తపోవన్ కాలని వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తపోవన్ కాలనీ దగ్గర రోడ్డుపై నవీన్ బైక్ వరద నీటిలో ఆగిపోయింది. 

స్కూటీపై వెనక ఉన్న వ్యక్తి బైక్ దిగి నెడుతున్న సమయంలో నవీన్ సరూర్‌నగర్ చెరువులోకి కొట్టుకుపోయాడు. దీంతో వెంటనే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. ఈరోజు మధ్యాహ్నం నవీన్‌కుమార్‌ మృతదేహం లభించింది. ప్రమాదం స్థలికి 30 మీటర్ల దూరంగా నవీన్ కుమార్ శవాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడి శవాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవీన్ కుమార్ మృతిచెందాడని తెలియడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో ముంగింది.