అక్రమ కట్టడాల కూల్చివేత.. జేసీబీకి ఎదురెళ్లిన మహిళా సర్పంచ్ - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ కట్టడాల కూల్చివేత.. జేసీబీకి ఎదురెళ్లిన మహిళా సర్పంచ్

November 22, 2019

ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఓ మహిళా సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టింది. అక్రమ కట్టడాలను కూల్చేందుకు వచ్చిన అధికారులను నిలువరించేందుకు ఏకంగా జేసీబీ వైపు దూసుకెళ్లింది. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా మందవాలా గ్రామంలో చోటు చేసుకుంది. దాని ముందటి భాగాన్ని పట్టుకొని పట్టుకొని పైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. దీన్ని స్థానిక వ్యక్తులు వీడియో తీయడంతో  ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. 

గ్రామ సర్పంచ్ రేఖా దేవీ అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీని కోసం ఆమె స్వయంగా జేసీబీకి అడ్డు తగిలింది. జేసీబీ డ్రైవర్ దాన్ని పైకి లేపినా ధైర్యంగా దాన్ని పట్టుకొని పోరాడింది. తర్వాత జేసీబీ డ్రైవర్ కిందకు దించాడు. ఈ ఘటనతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.  దీంతో స్థానికుల నిరసన పెరిగిపోవడంతో అధికారులు వెనుదిరిగారు. కాగా గతంలోనూ కట్టడాల కూల్చివేతను అడ్డుకునే సమయంలో ఓ జేసీబీ డ్రైవర్ గాయపడ్డాడు.