సార్స్ యాంటీబాడీలతో కరోనాను అరికట్టవచ్చు
సార్స్ యాంటీబాడీలతో కరోనాకు చికిత్స చేయవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. సార్స్ వ్యాధిని జయించిన వ్యక్తి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలు కరోనాను అంతమొందించడంలో సఫలం అయ్యాయని వారు చెబుతున్నారు. సార్స్ యాంటీబాడీలు కరోనాను కట్టడి చేసినట్టు తమ ప్రయోగశాలలో జరిగిన అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. సార్స్, కొవిడ్-19 వ్యాధి కారక వైరస్‌లు రెండూ కరోనా కుటుంబానికి చెందడంతో సార్స్ నిరోధక యాంటీబాడీలను కొవిడ్‌పై వారు ప్రయోగించామని చెప్పారు.
కరోనా వైరస్‌పై ఉన్న ప్రోటీన్లతో ఇవి అనుసంధానమై వైరస్‌ను నిర్వీర్యం చేస్తాయని వివరించారు. 8 రకాల యాంటీబాడీలను తొలుత వెలికి తీసిన శాస్త్రవేత్తలు వాటిలో అత్యంత ప్రభావ శీలమైన ఎస్309ని గుర్తించారు. ఇది కరోనాను కట్టడి చేయడంలో విజయవంతమైందని అన్నారు. ఈ యాంటీబాడీలు మనుషుల చికిత్సలో వినియోగించనప్పటివీ సార్స్ యాంటీబాడీల ప్రభావశీలతకు ఇది నిదర్శనమని శాస్త్రవేత్తలు అంటున్నారు.