కశ్మీర్‌పై అఫ్రిది నోటితీట.. గంభీర్ ఘాటువాత - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్‌పై అఫ్రిది నోటితీట.. గంభీర్ ఘాటువాత

April 3, 2018

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మళ్లీ నోరుపారేసుకున్నాడు. కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్‌లో భారత్ అమాయకులను చంపుతోందన్నాడు. దీనికి భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు. వీరిద్దరి ట్వీట్ల వార్ క్రికెట్ మించిన మ్యాచ్‌లా వైరల్ అవుతున్నాయి.  

భారత్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం తమ గళాన్ని వినిపిస్తున్న అమాయక ప్రజలు అన్యాయంగా తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. ఈ హింసను ఐక్యరాజ్యసమితి(యూఎన్), ఇతర ఎన్జీవోలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి?అని అఫ్రిది ట్వీటాడు.

https://twitter.com/SAfridiOfficial/status/981084208369192961

దేశభక్తి పాళ్లు కాస్త ఎక్కువన్న గంభీర్ దీనిపై వ్యంగంగా స్పందించాడు.  అఫ్రిది మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అతడు నోబాల్తో వికెట్తీసి సంబరాలు చేసుకుంటున్నాడని అన్నాడు. అఫ్రిది ట్వీట్పై స్పందించాలని విలేకర్లు నాకు ఫోన్చేస్తున్నారు. బుద్ధిమాంద్యం ఉన్న అతని దృష్టిలో యూఎన్ అంటే అండర్19 అని అర్థం. మీడియా ఆందోళనచెందక్కర్లేదు. అఫ్రిది నోబాల్తో వికెట్తీసి సంబరపడుతున్నాడు’ అని ఎద్దేవా చేశాడు. అఫ్రిదీ, గంభీర్‌ గతంలోను వాగ్యుద్ధాలు చేసుకున్నారు.

https://twitter.com/GautamGambhir/status/981136834913763333