Home > రాజకీయం > శశికళ…విలవిల….

శశికళ…విలవిల….

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. శశికళ అంతా సెటిల్ మెంట్లతో సెట్ చేస్తారని తన పై జరుగుతున్న ప్రచారాన్ని మరో సారి ప్రూవ్ చేసుకున్నట్లైంది. జైళ్ల ఉంటున్న ఆమెకు సకల సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖాధికారికి 2 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఐజీ రూపా పెద్ద బాంబు పేల్చారు. కష్టాలన్నీ మర్చిపోతున్న తరుణంలో మేడమ్ గారికి కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పుడు జైళ్లో ఉన్న అన్ని సౌకర్యాలు కట్ చేయడమే కాదు… జైలు కూడా మారుస్తారని అంటున్నారు.

ఎంతో కష్టపడి సిఎం కుర్చీ ఎక్కుదామనుకునే లోపే… జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుండైనా పాలనా పగ్గాలు పట్టుకుని లాగేద్దామంటే…పక్కలో బల్లెం మాదిరి పన్నీర్ సెల్వం నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఏఐడిఎంకే రెండాకుల గుర్తు కోసం గడ్డి కరిపించబోయి దినకరన్ అడ్డంగా దొరికి ఆమెకు పెద్ద కష్టమే తెచ్చాడు. పార్టీ నాయకులు, సిఎం పళని స్వామి తదితరలంతా… అయ్యో దినకరనా…. అనుకునే లోపే… అమ్మగారి మీద ఈ ఆరోపణలు వచ్చాయి.

అయితే పోయెస్ గార్డెన్ నుండి కాలు తీసిన తర్వాత శశికళ కళ్లల్ల నీళ్లే ఉన్నట్లున్నాయి. పార్టీలో ఇప్పుడున్న వారిలో ఎంత మంది ఉంటారో తెలియదు. ఎంత మంది పోతారో తెలియదు. గోల్డెన్ బే రిసాట్ వద్ద జరిగిన తతంగాన్ని అంతా ఎంఎల్యేలు పూస గుచ్చినట్లు… కాదు కాదు… కళ్లుకు కట్టినట్లు ఓ టీవి ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో చెప్పారు. అప్పుడే శశికళ రాజకీయ చతురత అంతా మనీ మ్యాటర్ లోనే ఉందని తేలిపోయింది. అయితే జైళ్లో కష్టాలు పడుతున్నది కాబట్టి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు.

శశికళ పేరు మీద ఓ ఘటన మర్చిపోక ముందే మరోటి వచ్చి పడుతూనే ఉన్నాయి. పార్టీ నాయకులు… ఎంఎల్యేలు…. ముఖ్యమంత్రి పదవి…. చివరాఖరకు ఎన్నికల కమిషన్ సభ్యులకు కూడా లంచాలివ్వాలని చూస్తే ఎట్లా. అందుకే శశికళ అండ్ కోకు ఎన్నికలు అంటే… ఓట్లు.. సీట్లు అమ్మడం కొనడం తప్ప మరోటి కాదని బాగా అర్థం అయినట్లుంది. అన్నీ డబ్బులతోనే సెట్ చేద్దామని అనుకుంటున్నట్లుంది.

ఇంకో వైపు తమను మన్నార్ గుడి మాఫీయా అనొద్దని శశికళ సొంత గ్రామం వాళ్లు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. తాము మాఫీయా కాదని ఎన్ని మార్లు… ఎన్ని తీర్లు చెప్పినా ప్రయోజనం ఉండటం లేదు. నెల తిరగక ముందే పతాక శిర్షీకల్లో శశికల పేరు ఏదో రూపంలో కన్పిస్తుంటే…. మీడియా… జనాలు మాత్రం ఏదో అనకుండా ఎట్లా ఉంటారండీ బాబు. జైళ్ల అష్ట కష్టాలు పడుతున్నట్లు కొద్ది రోజుల కిందటి వరకు మీడియాలో వార్తలు వచ్చాయి.తూ…చ్ అంతా ఉత్తదేనని ఐజీ రిపోర్ట్ తో తేలి పోయింది.

నీతి : ఉన్నత స్థానాన్ని అందుకోవాలటే….. మెట్లెక్కి వస్తే ఆ ఆనందమే వేరు. లిఫ్టు ఎక్కి వచ్చినా ఫర్లేదు. అడ్డదారి అదీ కాదని…..ఎగిరి పోవాలంటే…శశికళ గారిలా అవ్వాల్సి ఉంటుంది.

Updated : 13 July 2017 11:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top