సీఎం ప్రారంభించిన నెలకే కొట్టుకుపోయిన బ్రిడ్జి.. 8 ఏళ్ల కష్టం వృధా - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం ప్రారంభించిన నెలకే కొట్టుకుపోయిన బ్రిడ్జి.. 8 ఏళ్ల కష్టం వృధా

July 16, 2020

Sattarghat Bridge Collapse One Month in Bihar

8 ఏళ్ల కష్టం..రూ. 269 కోట్ల డబ్బు అంతా బూడిదలో పోసిన పన్నీరులా అయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన బ్రిడ్జి నదిలో కొట్టుకుపోయింది. ఏకంగా సీఎం ప్రారంభించిన 29 రోజులకే వంతెన కొట్టుకుపోవడంతో నిర్మాణంపై ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తుతోంది. బిహార్‌లోని గోపాల్ గంజ్‌లో  బుధవారం ఇది జరిగింది. 

గండక్ నదిపై రాకపోకల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సత్తార్‌ఘాట్ బ్రిడ్జి నిర్మించింది. 1,440 మీటర్ల పొడవైన ఈ వెంతనకు రూ. 269 కోట్లు ఖర్చు చేశారు. నిర్మాణం పూర్తి కావడంతో జూన్‌ 16న సీఎం నితీష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అయితే నదిలో వరద ఉదృతి పెరగడంతో వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది. ఇంత తక్కువ సమయంలోనే ఇలా జరిగితే ఇంకా ఎక్కువ కాలం ఎలా మన్నికగా ఉంటుందని పలువురు మండిపడుతున్నారు.  ఇంత నాసిరకంగా వంతెన నిర్మిచారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధం చేసుకోవచ్చని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  నితీష్ హయాంలో ఇలాంటివి మామూలే అంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ యాదవ్ ఎద్దేవా చేశారు. దీనికి శంకుస్థాపన కూడా 2012 నితీశ్ కుమార్ చేతుల మీదుగానే జరిగింది.