కశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్! - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్!

October 22, 2019

Satya  .

అక్టోబరు 31 తర్వాతి నుంచి జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌లు అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. దీనికి సంబంధించిన పునర్విభజన చట్టం ఈ నెలాఖరు నుంచి అమలు కానుంది. అక్టోబర్ 31న కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో కూడా ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అక్కడ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరు నియమితులు అవుతారనే విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ ప్రస్తుత గవర్నర్‌ సత్యపాల్‌ మాలికే నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్‌, లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితులు సత్యపాల్‌ మాలిక్‌కు తెలిసినంతగా మరొకరికి అవగాహన ఉండకపోవచ్చనే భావనలో కేంద్రం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలోనే తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా సత్యపాల్‌ను నియమించే అవకాశం మెండుగా ఉందని చెప్పారు. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తారని సమాచారం. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. కాగా, పోలీసులు, శాంతి భద్రతల అజమాయిషీ ఢిల్లీ మాదిరిగా కేంద్రం పరిధిలోకి రానుంది. సాధారణ పరిపాలన మాత్రం స్థానిక ప్రభుత్వం పరిధిలో ఉంటుంది.