ఏపీ : నిర్దోషి అయినా తొమ్మిదేళ్లు జైల్లో.. నష్టపరిహారానికి డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ : నిర్దోషి అయినా తొమ్మిదేళ్లు జైల్లో.. నష్టపరిహారానికి డిమాండ్

May 16, 2022

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సంచలనం రేపిన అయేషా మీరా అనే ఫార్మసీ విద్యార్ధిని హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు ఇప్పుడు తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. చేయని నేరానికి తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించానని, కేసులో పోలీసుల తీర్పును తప్పుపడుతూ హైకోర్టు వ్యాఖ్యలు, లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించడాన్ని సత్యం బాబు గుర్తు చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో నిర్దోషినైన తనకు రెండెకరాల పొలం, రూ. 10 లక్షల నగదు సహాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చాడు. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరాడు. కాగా, 2007లో అయేషా మీరా హత్య జరిగింది. బలమైన రాజకీయ పలుకుబడి ఉన్న నేత కుమారుడిని రక్షించే క్రమంలో సత్యం బాబును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, పోలీసులు సరైన దిశలో దర్యాప్తు చేయలేదని గతంలో హైకోర్టు వ్యాఖ్యానించింది.