కైలాశ్ సత్యార్థి.. సురక్షిత్ బచ్ పన్ -సురక్షిత్ భారత్...! - MicTv.in - Telugu News
mictv telugu

కైలాశ్ సత్యార్థి.. సురక్షిత్ బచ్ పన్ -సురక్షిత్ భారత్…!

August 29, 2017

నోబెల్ అవార్డు గ్రహీత  కైలాశ్ సత్యార్థి  చిన్న పిల్లలపై జరుగుతున్న వేధింపులు, లైంగిక దాడులకు వ్యతిరేకంగా  దేశవ్యాప్తంగా  సురక్షిత్ బచ్ పన్- సురక్షిత్  భారత్ అనే యాత్ర చేపట్టుతున్నట్టు పేర్కొన్నారు.  ఇవాళ కైలాశ్ సత్యార్థి ఈ విషయంపై మాట్లాడుతూ.. ఈ యాత్ర కు రాష్ట్రపతి, ప్రధాని మద్దతు  తెలపారని, సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. చిన్నపిల్లల రక్షణ కోసం పార్లమెంట్ లో కఠిన చట్టం తేవాలని కైలాశ్  సత్యార్థి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో భాగంగా కోటి మందిని కలవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సురక్షిత్ బచ్ పన్- సురక్షిత్ భారత్ యాత్ర కన్యా కుమారి నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21న హైదరబాద్ కు చేరేకుంటుందని అని తెలిపారు.ఈ యాత్రను 22 రాష్ట్రాలు,కేంద్రప్రాంతాలు గుండా 35 రోజులు చేపట్టనున్నట్టు కైలాశ్ సత్యార్థి తెలిపారు.