Satyendar Jain's jailhouse 'luxury': After massage, now lavish meal for AAP leader in Tihar
mictv telugu

జైలులో మంత్రికి రాజభోగాలు.. మరో వీడియో విడుదల చేసిన బీజేపీ

November 23, 2022

ఈడీ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్‌కు వీడియోలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది బీజేపీ. కొన్ని రోజుల క్రితం సత్యేందర్ జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసి బీజేపీ, తాజాగా మంత్రి విలాసవంతమైన భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోని విడుదల చేసింది. ఇది మరోసారి రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణం అయింది. ఇప్పటికే మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ వీడియో రచ్చరచ్చ అయింది. మొదటగా మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తిని ఫిజియోథెరపిస్ట్‌గా పేర్కొంది ఆప్. అయితే తరువాత అతను జైలులో ఖైదీ అని తేలింది. అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్నట్లు జైలు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇక తాజాగా సత్యేంద్ర జైన్ భోజనానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది బీజేపీ. ఇందులో అతను లగ్జరీ భోజనం చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీనిపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి హెహజాద్ పూనావాలా.. వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘రేపిస్టుతో మసాజ్ చేయించుకుని, ఫిజియోథెరపిస్టు అని చెప్పారు. ఇప్పుడు మంత్రి గారు ఏదో సెలవులో రిసార్ట్‌లో ఉన్నట్లు జైలు అటెండెంట్లు ఆహారం అందించారు. విలాసవంతమైన భోజనం ఇది’’ అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు రోజు జైలులో తనకు సరైన ఫుడ్ పెట్టడం లేదని చెప్పిన తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.