Satyendar Jain's 'Masseur' a Tihar Prisoner, Not Physio 
mictv telugu

ఫిజియోథెరపిస్ట్ కాదు రేపిస్ట్

November 22, 2022


మంత్రి సత్యేంద్ర జైన్ మసాజ్ వీడియా విషయంలో ఆప్‌కు షాక్ తగిలింంది. మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్ట్ కాదు రేపిస్టు అని జైలు అధికారులు తేల్చేశారు. ఫోక్సో చట్టంతో సహా ఐపీసీ 376, 506,509 సెక్షన్ల కింద అతనిపై అభియోగాలున్నాయి. మాసాజ్ కాదు ఫిజియోథెరపి ట్రీట్ మెంట్ అని కలరింగ్ ఇస్తున్న ఆప్ ఇప్పుడు చిక్కుల్లో పడింది.

మసాజ్‌లో మలుపు

మనీలాండరింగ్ కేసులో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ తీహార్ జైలులో ఉన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తూ రాజభోగాలు అనుభవిస్తున్నారు. జైల్లో మసాజ్‌లు చేయించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అవినీతి కేసులో అరెస్టయిన మంత్రి జైల్లో లగ్జరీ లైఫ్ అనుభవించడం ఏంటని బీజేపీ విమర్శలు చేసింది. వరుసగా మంత్రి మసాజ్ వీడియోల్ని రిలీజ్ చేసింది. దీనికి ఆప్ చీఫ్ కేజ్రీవాల్‌తో సహా ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అది మసాజ్ కాదు ఫిజియోథెరపీ ట్రీట్ మెంట్ అని సమర్థించుకున్నారు. వైద్యుల సూచనమేరకు ఫిజియోథెరపీలో భాగంగా చికిత్స తీసుకున్నారని చెప్పుకొచ్చారు.

అధికారుల ఝలక్

తీహార్ జైలు అధికారులు మాత్రం షాక్ ఇచ్చారు. ఇతను ఫిజియోథెరపిస్ట్ కాదు రేపిస్టు అని తేల్చిచెప్పారు. దీంతో ఆప్ నేతలు అవాక్కయ్యారు. మంత్రి సత్యేంద్ర జైన్‌కి మసాజ్ చేసింది రేపిస్ట్ రింకు అని జైలు అధికారులు చెప్పారు. ఫోక్సో కేసులో 2001 నుంచి జైలులో ఉన్నాడు.ఐపీసీ 376, 506,509 సెక్షన్ల కింద కూడా ఇతనిపై కేసులు ఉన్నాయి.

ఆప్ నేతల వాదన

మసాజ్ వీడియో ట్విస్ట్ పై ఆప్ నేతలు స్పందించారు. గుజరాత్ , ఎంసీడీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ని బద్నాం చేసేందుకు ఇలా చేస్తున్నారని ఆ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ ఆరోపించారు. గత పదిరోజులుగా బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని. గతంలో అమిత్ షా జైలులో ఉన్నప్పుడు వీఐపీ ట్రీట్ మెంట్ పొందారని గుర్తు చేశారు. ఎంసీడీ ఎలక్షన్లలో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు.

బీజేపీ నేతల ఫైరింగ్

“సత్యేంద్ర జైన్ 5 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. అయినా అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. మసాజ్ చేసే వ్యక్తిని కేజ్రీవాల్ పంపించారు. టీవీ, బెడ్ ,వాటర్ బాటిల్స్ సెల్‌కు పంపి జైలు నిబంధనల్ని తుంగలో తొక్కారు. జైలులో రాజభోగాలు అనుభవిస్తున్న సత్యేంద్ర జైని కేజ్రీవాల్ మంత్రి వర్గం నుంచి ఎందుకు తీసేయడం లేదు. ఆయన్ను వెనకేసురావడానికి కారణాలేంటి?”
అని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.

ఎన్నికల అస్త్రం

మొత్తానికి గుజరాత్ , ఎంసీడీ ఎన్నికలకు ముందు బీజేపీకి మంచి అస్త్రం దొరికింది. ప్రచారంలో ఆప్‌ని ఇరుకున పెడుతోంది. అవినీతిలో ఆప్ నేతలు కూరుకుపోయారని బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.