మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, సత్యేంద్ర జైన్ ఇళ్లు, కార్యాలయాలతోపాటు.. ఆయనతో సన్నిహితంతగా ఉండే వారిపై దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు చెందిన అత్యంత సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడిలో 2 కోట్ల 82 లక్షల నగదు, 1.80 కిలోల బంగారాన్ని దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. సత్యేంద్ర జైన్ సన్నిహితుల లొకేషన్ల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 133 బంగారు నాణేలను స్వాధీనం చేసుకుంది. హవాలా లావాదేవీల కేసులో సత్యేంద్ర జైన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సత్యేంద్ర జైన్ ED కస్టడీలో ఉన్నారు.
ఇదే కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ గత ఏప్రిల్‌లో జప్తు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద సత్యేంద్ర జైన్‌పై సీబీఐ 2017లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు సాగిస్తోంది.