Saudi Arabia Announces Discovery Of Huge Gold And Copper Deposits In Medina
mictv telugu

మదీనాలో భారీగా బంగారం నిక్షేపాలు.. సౌదీ ఆరేబియా

September 23, 2022

ముస్లింల పవిత్ర నగరం మదీనాలో బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు సౌదీ ఆరేబియా ప్రకటించింది. బంగారు, రాగి కొత్త గనులను కనుగొన్నట్లు ఆ దేశానికి చెందిన జియోలాజికల్‌ సర్వే తన ట్వీట్‌లో తెలిపింది. మదీనా ప్రాంతంలో ఉన్న అబా అల్‌ రహ వద్ద బంగారం నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. వాది అల్ ఫారా ప్రాంతంలో సుమారు నాలుగు చోట్ల రాగి గనులు ఉన్నట్లు భావిస్తున్నారు. బంగారం, రాగి గనుల వల్ల ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని సౌదీ జియోలాజికల్ సర్వే తన రిపోర్ట్‌లో రాసింది.

కొత్త మైనింగ్‌ ప్రాంతాల వల్ల సుమారు 533 మిలియన్ల డాలర్ల పెట్టుబడిని ఆకర్షించవచ్చు అని, దాదాపు 4 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా సౌదీ అరేబియాలో దాదాపు 5,300 మినరల్ లొకేషన్‌లు ఉన్నాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ గతంలో తెలిపారు. వీటిలో విభిన్నమైన మెటల్ ,నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకరణ శిలలు , రత్నాలు ఉన్నాయన్నారు.తాజా ఆవిష్కరణలతో, ప్రపంచ దేశాలనుంచి ఆశాజనకమైన పెట్టుబడి అవకాశాలు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.