సౌదీ మహిళలకు మరో శుభవార్త.. వారూ యుద్ధం చేస్తారు - MicTv.in - Telugu News
mictv telugu

సౌదీ మహిళలకు మరో శుభవార్త.. వారూ యుద్ధం చేస్తారు

February 27, 2018

కఠిన కట్టుబాట్లను వదిలించుకుంటున్నసౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో మహిళలు కూడా చేరొచ్చని ప్రకటించింది. మహిళల సాధికారత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంది. అభ్యర్థులు రియాద్‌, మక్కా, అల్‌-ఖాసిం, మదీనా తదితర రాష్ట్రాల్లోని సంబంధిత కార్యాలయాల్లో వచ్చే మార్చి 1వ తేదీలోపల దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.అభ్యర్థులకు 12 అర్హతలను ఉండాలి. 1. సౌదీ జాతీయురాలై ఉండాలి. వయసు 25-35 ఏళ్ల మధ్య ఉండి  హైస్కూలు విద్య పూర్తి చేసి ఉండాలి. 155 సెంటీమీటర్ల ఎత్తు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. గార్డియన్‌ అనుమతితోనే సైన్యంలో చేరాలి, తదితర నిబంధనలున్నాయి. అయితే నిబంధనలు కఠినంగా ఉన్నాయంటున్నారు మహిళలు, గార్డియన్ అనుమతి తప్పనిసరి అన్న నిబంధన కష్టమని, మతఛాందసవాదులు అందుకు ఒప్పుకోరని అంటున్నారు. సౌదీ ప్రభుత్వం ఇటీవల మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తామని, వారు కూడా ఫుట్ బాల్ మ్యాచ్‌లు చూడొచ్చని నిబంధనలను సడలించడం తెలిసిందే.