ఇంద్రధనుస్సు రంగుపై సౌదీ నిషేధం.. గే సెక్స్ అంటూ.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇంద్రధనుస్సు రంగుపై సౌదీ నిషేధం.. గే సెక్స్ అంటూ..

June 18, 2022

కఠినమైన ఆంక్షలకు, మరణశిక్షలకు పెట్టింది పేరు గల్ఫ్ దేశాలు. మతం, కట్టుబాట్లు విషయంలో చాలా తీవ్రంగా స్పందిస్తుంటాయి అక్కడి ప్రభుత్వాలు. తాజాగా ఏకంగా ఏడురంగుల ఇంద్రధనుస్సు రంగులపైనే నిషేధం విధించారు. రెయిన్‌బో రంగుల్లో ఉండే ఆటబొమ్మలును పిల్లల దుస్తులను, కవర్లను జప్తు చేస్తున్నారు. ఇవి స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తాయంటూ ఈ చర్య తీసుకున్నారు. తమ లైంగిక ప్రత్యేకతను గుర్తింపుగా స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లు రెయిన్‌బో రంగులు వాడుతుండటం తెలిసిందే. ఎల్జీబీటీ కమ్యూనిటీలు ఈ నెలలో ‘ప్రైడ్’ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వేటు పడడం గమనార్హం.

దీంతో ఆ రంగుల గే సెక్స్‌కు ఊతమిస్తాయని సౌదీ అధికారులు భావించారు. దేశ రాజధాని రియాద్‌లోని దుకాణాల నుంచి రెయిన్‌బో రంగుల్లో ఉన్న వస్తువులు తీసిపారేస్తున్నారు. ‘ఇవి ఇస్లాం మతానికి వ్యతిరేకం. యువత పాడైపోతుంది. కట్టుబాట్లను ఉల్లంఘించేలా ఉండేలా వస్తువులను తొలగించాలి. వాటిని అమ్మితే శిక్షిస్తాం’ అని ప్రభుత్వం తన ట్విటర్ ఖాతాలో హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్ష పడుతుంది.