Saudi Arabia beheading by sword, executes 12 people in 10 days
mictv telugu

10 రోజుల్లో 12 మంది తలలు నరికారు

November 22, 2022

సౌదీ అరేబియాలో కఠిన శిక్షలు ఉంటాయని సంగతి అందరికీ తెలిసిందే. తప్పు చేస్తే తలలు తెగ నరికేస్తారు. ఇస్లాం మత విశ్వాసాలను ఉల్లంఘించిన వారితో పాటు లైంగిక సంబంధాలు కలిగిని వారికి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడిన వారికి ఇక్కడ పబ్లిక్‌గా మరణ శిక్షలు అమలు చేస్తారు. మద్యం సేవించడం, దొంగతనం చేయడం వంటి నేరాలకు బహిరంగాగానే కాళ్లు, చేతులు కోసేస్తారు. అయితే గత రెండేళ్లలో తగ్గిన మరణశిక్షలు మళ్లీ పెరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా డ్రగ్స్ కేసుల్లో సౌదీ అరేబియా పది రోజుల్లో 12 మందికి మరణశిక్ష విధించింది. వారందరి తలలును కత్తితో నరికి శిక్ష అమలు చేసింది. ఇలాంటి శిక్షలు విధించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. జైలు శిక్ష పూర్తయిన తర్వాత వీరికి మరణ శిక్షలు విధించారు. వీరిలో నలుగురు సిరియన్లు, ముగ్గురు పాకిస్థానీయులు, ఇద్దరు జోర్డానియన్లు, ముగ్గురు సౌదీకి చెందిన వారున్నారని టెలిగ్రాఫ్ రిపోర్ట్ వెల్లడించింది.ఈ ఏడాది ఇప్పటికే 132 మందికి మరణ శిక్షలు విధించారు. వీటిలో చాలా వరకు కత్తితో తలలు నరికినవేనని నివేదికలు చెబుతున్నాయి. మరణ దండన విధించడంపై హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీలైనంత వరకు మరణ శిక్షలను తగ్గిస్తామని సౌదీ ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్ మాటిచ్చారు. ఇప్పుడు అధిక సంఖ్యలు మరణశిక్షలు విధంచడంపై విమర్శలు వస్తున్నాయి.