సౌదీలో హైదరాబాద్ మహిళపై ఘోరం.. - MicTv.in - Telugu News
mictv telugu

సౌదీలో హైదరాబాద్ మహిళపై ఘోరం..

November 22, 2017

సౌదీ అరేబియాలోకు అక్రమంగా తరలిస్తున్న హైదరాబాద్ యువతులపై చెప్పలేనన్ని ఘోరాలు సాగుతున్నాయి. తాజాగా సబా ఫాతిమా అనే 24 ఏళ్ల యువతిపై ఆమె యజమాని కుటుంబం పైశాచికంగా ప్రవర్తించింది. వేడివేడి నూనెను ఆమెపై పోశారు. కాళ్లు, పొట్ట, తొడ భాగాల్లో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తాడ్‌బండ్‌కు చెందిన ఫాతిమా తల్లి మెహరాజ్ ఉన్నీసా ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లింది. తన కుమార్తెను తిరిగి హైదరాబాద్ కు తీసుకురావాలని కోరింది. ఏజెంట్లు సౌదీలో మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మించి తన కూతురిని తీసుకెళ్లారని, చివరకు ఓ ఇంట్లో పనిమనిషిగా మార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ చేరినప్పటి నుంచి యజమాని కుటుంబం ఫాతిమాను చిత్రహింసలు పెట్టిందని సోదరి పర్వీన్ ఫాతిమా చెప్పారు.