భారత్‌కు వెళ్లొద్దు.. సౌదీ అరేబియా హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌కు వెళ్లొద్దు.. సౌదీ అరేబియా హెచ్చరిక

May 23, 2022

తగ్గినట్లే తగ్గి మళ్లీ కొవిడ్ మహమ్మారి కొత్త వేరియెంట్లు వ్యాప్తిచెందుతున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ ఉప వేరియంట్లు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా తమ దేశ పౌరులకు సంచలన హెచ్చరిక జారీ చేసింది. ఆ దేశంలో ఇటీవల కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా తమ పౌరులు భారత్‌తో సహా పదహారు దేశాలకు వెళ్లకుండా సౌదీ అరేబియా ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆ దేశాల జాబితాలో లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, అఫ్ఘానిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, ఆర్మేనియా, బెలారస్, వెనిజులా దేశాల్లో సౌదీ పౌరులు ప్రయాణించడాన్ని నిషేధించింది. కరోనా వైరస్ కట్టడి కోసం సౌదీ పౌరులపై ప్రయాణ నిషేధాన్ని విధించినట్లు సౌదీ ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ తెలిపారు. మరోవైపు సౌదీ రేబియాలో మంకీ పాక్స్ కేసులు నమోదవ్వలేదని అధికారులు తెలిపారు. ఒకవేళ మంకీ పాక్స్ కేసులు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.