పెద్దగా చదువు ఉన్నా లేకపోయినా ఎంచక్కా సౌదీకెళ్లి నాలుగురాళ్లు సంపాదించుకోవచ్చు.పది, పదిహేనేళ్లు కష్టపడితే ఆ తర్వాత ఇక్కడకు వచ్చి దర్జాగా బతుకేయుచ్చు.. అనుకుంటే ఇక ముందు అలా కుదరదు. అక్కడున్నోళ్లే తిరిగి వచ్చేలా చేసింది సౌదీ సర్కార్. ఇంతకీ ఏం చేసింది.?
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎక్కువగా పోతుంటారు. వివిధ కంపెనీల్లో దాదాపు 41లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఇలా అక్కడికి వస్తున్న భారతీయుల భారం ఎక్కువగా ఉంటుందని కొత్తగా ‘డిపెండెంట్ ఫీ’ పేరుతో కుటుంబ పన్ను వేయనున్నట్లు సౌదీ ప్రకటించింది. జులై 1 నుంచి ఈ పన్ను అమల్లోకి రానుందట. అక్కడ ఉండే ఒక్కో భారతీయుడు ప్రతీనెలా 100 రియాల్స్ పన్ను కట్టాల్సి ఉంటుంది. మన కరెన్సీలో దాదాపు రూ.1,700.
సౌదీ తీసుకొచ్చిన కొత్త నిబంధనతో చాలా మంది భారతీయులు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. సుమారు రూ.86,000 ఆదాయం ఉన్న కుటుంబాలకు సౌదీ అరేబియా కుటుంబ వీసాను మంజూరు చేస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ నెలకు రూ.5100 కట్టక తప్పదు. 2020 వరకు ఈ డిపెండెంట్ టాక్స్ అమల్లో ఉండబోతోంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారంం అందలేదని, ఒక వేల అదే నిజమైతే వలసలపై ఉంటుందని భారత విదేశాంగ శాఖ అంటోంది.
Saudi Arabia’s/India/Gulf Victims