భర్త/భార్య ఫోన్ చూస్తే ఏడాది జైలు - MicTv.in - Telugu News
mictv telugu

భర్త/భార్య ఫోన్ చూస్తే ఏడాది జైలు

April 3, 2018

టెక్నాలజీతో ఓ పక్క టెక్నికల్ నాలెడ్జి పెరుగుతోంది. మరోపక్క మనుషుల మధ్య అనురాగాలు తగ్గుతున్నాయి. అనుమానాలు పెచ్చరిల్లుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది. ఫోన్ ముచ్చట్లు కొంపలు కూలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దొంగచాటుగా జీవిత భాగస్వామి ఫోన్‌ను చూస్తే ఏడాది జైలు శిక్ష విధించాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

జీవిత భాగస్వామి ఫోన్ నుంచి వివరాలు తెలుసుకోవడం, తర్వాత వేరే వ్యక్తితో సంబంధాలను అంటగట్టడం, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ వంటి కేసులు సౌదీలోనూ ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వ్యక్తిగత గోప్యత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దొంగచాటుగా ఫోన్ వివరాలను తెలుసుకుంటే ఏడాది జైలుశిక్ష,  1.33 లక్షల డార్ల జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. ఆడా, మగా తేడా లేకుండా అందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.