సౌదీ అరేబియాలోని ముస్లింల పుణ్యక్షేత్రం మక్కా మసీదులో కలకలం రేగింది. మనిస్థిమితం లేని ఓ వ్యక్తి కారు నడుపుకుంటూ ఏకంగా మసీదు ప్రాంగణంలోకి దూసుకెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది కన్నుగప్పి ఓ ద్వారాన్ని ఢీకొట్టాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. వేగంగా వచ్చిన కారు కాంపౌండ్ లోపలికి దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే కారు అక్కడి దక్షిణంపై గేటు తలుపును ఢీకొట్టి ఆగిపోయింది. కారు నడిపిన వ్యక్తి తిక్కతిక్కగ మాట్లాడాడని, అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. సాధారణంగా మక్కా మసీదు వద్ద గట్టి భద్రత ఉంటుంది. అంచెలవారీ భద్రతను అధిగమించి అతడు లోపలికి ఎలా వచ్చాడో అంతుబట్టడం లేదని పోలీసుల ఆశ్చర్యపోతున్నారు. కరోనా వల్ల ఏడునెలల పాటు మూత పడి ఉన్న మసీదు ఇటీవలే తెరిచారు.
https://twitter.com/jamlishofficial/status/1322479710325137408