విజువల్ వండర్ అవతార్ సినిమాలో చూపించిన కొత్త ప్రపంచంపై సినీ ప్రియులు ఆశ్చర్యాభిమానికి లోనయిన విషయం తెలిసిందే. అది గ్రాఫిక్సే అయినా ఊహకు కూడా అందని విజువల్స్ కావడంతో విపరీతంగా నచ్చేసింది. అలాంటి ఓ అద్బుతాన్ని సౌదీ అరేబియా నిజం చేయబోతోంది. ప్రపంచంలో మరెక్కడా లేనట్టుగా రాజధాని రియాద్‌లో ముకాబ్ పేరుతో మహాద్భుత కట్టడాన్ని నిర్మిస్తోంది. 400 మీటర్ల పొడవు, ఎత్తు, వెడల్పుతో నిర్మించే ఈ కట్టడంలో లక్ష ఇళ్లు, 9 వేల హోటళ్లు, యూనివర్సిటీ, మార్స్‌పైకి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, 20 నిమిషాల్లో ఎయిర్‌పోర్టుకు చేరిక, ఆఫీసులు, మ్యూజియాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు ఉంటాయి.
భవనం కింది భాగంలో ఉండే పట్టణానికి న్యూ మురబ్బా అని పేరుపెట్టి ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసింది. దీంతో పాటు ముకాబ్‌లో 20 ఎంపైర్ స్టేట్ భవనాలను నిర్మించి 2030 వరకు పూర్తి చేస్తామని ఆ దేశం చెప్తోంది. మరికొన్ని విశేషాలను పరిశీలిస్తే.. రెండున్నర కోట్ల చదరపు కిలోమీటర్ల ఫ్లోర్ ఏరియా, లక్షా 4 వేల ఆవాసాలు, 9 లక్షల 80 వేల చదరపు మీటర్ల రిటైల్ స్పేస్, 14 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్, 6 లక్షల 20 వేల చదరపు మీటర్ల లీజర్ అసెట్స్, 18 లక్షల చదరపు మీటర్లలో ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎడారి దేశమైన సౌదీ అరేబియా భవిష్యత్ అవసరాల కోసం ఈ మెగా భారీ ప్రాజెక్టుని చేపట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.