Saudi Arabia Seizes Rainbow Toys Amidst Crackdown on Homosexuality
mictv telugu

ఆ దేశంలో రెయిన్‌బో కలర్స్ బ్యాన్.. కారణం ఏంటంటే..

June 16, 2022

Saudi Arabia Seizes Rainbow Toys Amidst Crackdown on Homosexuality

రెయిన్‌బో కలర్స్‌ను బ్యాన్‌ చేస్తూ ముస్లిం దేశాలలో ఒకటైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని అధికారులు రెయిన్‌బో కలర్స్‌లో ఉన్న బొమ్మలు, పిల్లల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. అవి స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.

రాజధాని రియాద్‌లోని దుకాణాల నుంచి వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అనేక రకాల వస్తువులను తొలగిస్తున్నట్లు అల్-ఎఖ్బరియా నివేదిక తెలిపింది. ఇలా ఆంక్షలు విధించిన వాటిలో హెయిర్ క్లిప్‌లు, పాప్-ఇట్స్, టీషర్టులు, టోపీలు, పెన్సిల్ వంటివి ఉన్నాయి. ఈ విషయంపై ఓ అధికారి మాట్లాడుతూ.. ఇవన్నీ ఇస్లామిక్ విశ్వాసం, ప్రజా నైతికతలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.
యువ తరాన్ని లక్ష్యంగా చేసుకుని స్వలింగ సంపర్క రంగులను ప్రోత్సహిస్తాయని తెలిపారు. అలాంటి వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలు చట్టపరమైన జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది.