మక్కా మసీదు బంద్.. వైద్య పరీక్షలు జరిపాకే - MicTv.in - Telugu News
mictv telugu

మక్కా మసీదు బంద్.. వైద్య పరీక్షలు జరిపాకే

February 27, 2020

Suspends

కరోనా (కోవిడ్ -19) ప్రభావం సౌదీ అరేబియాకు కూడా తాకింది. ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా మసీదు, మదీనా మసీదుల సందర్శనను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది.  కోవిడ్‌ వైరస్‌ విస్తరించిన దేశాలకు చెందిన యాత్రికులను ఎంత మాత్రం అనుమతించబోమని స్పష్టం చేశారు. దీని కారణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటికే వీసాలపై తమ దేశం వచ్చిన విదేశీయులను తగిన వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే మక్కా సందర్శనకు అనుమతిస్తామని ప్రకటించారు. 

వైరస్ ప్రమాదకర స్థితికి చేరుకోడంతో వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించినట్టు చెబుతున్నారు. తాజా నిర్ణయంతో మక్కా సందర్శకులకు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది హజ్‌ యాత్ర సందర్భంగా జూలై నెలలో ప్రపంచంలోని పలు దేశాల నుంచి ముస్లింలు మక్కాను సందర్శిస్తారు. దీంతో అప్పటి వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయా, లేక ఎత్తివేస్తారా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. మొత్తానికి చైనాలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అంతటిని భయపెడుతోంది. దీని కారణంగా ఇప్పటికే వివిధ దేశాల్లో ఎగుమతులు, దిగుమతులు,రాకపోకలపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే.