కమలా హ్యారిస్, బైడెన్‌లను గేలి చేస్తూ సౌదీ ప్రభుత్వ వీడియో... - MicTv.in - Telugu News
mictv telugu

కమలా హ్యారిస్, బైడెన్‌లను గేలి చేస్తూ సౌదీ ప్రభుత్వ వీడియో…

April 14, 2022

8

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లపై సౌదీ అరేబియా ప్రభుత్వ మీడియా ఓ వ్యంగ్య వీడియో రూపొందించింది. సోమవారం ప్రసారమైన ఈ వీడియోలో బైడెన్, కమలా హ్యారిస్‌లు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై మీడియాతో మాట్లాడడానికి వస్తారు. ఈ క్రమంలో బైడెన్ మీడియా పోడియంను దాటి ముందుకెళ్లిపోతే, కమలా ఆయనను వెనక్కి తీసుకు వస్తారు. అనంతరం బైడెన్ మాట్లాడుతూ, రష్యా అని అనకుండా స్పెయిన్, ఆఫ్రికా అని మొదలు పెడతాడు. పక్కనే ఉన్న కమలా ఆయనను వారించి రష్యా అని చెబుతుంది. పుతిన్ పేరు కూడా గుర్తు లేకపోతే కమలా గుర్తు చేస్తుంది. పుతిన్ పేరు ఎత్తగానే బైడెన్ నిద్రలోకి జారుకుంటాడు. కమలా తట్టి లేపగా, మాటల్లో కమలా హ్యారిస్‌ను సంబోధిస్తూ ‘ఫస్ట్ లేడీ’ అని పిలుస్తాడు. కాగా, ఈ వీడియో సౌదీ ప్రభుత్వ అనుమతితోనే రూపొందినట్టు తెలుస్తోంది. బైడెన్ ప్రభుత్వం వచ్చాక సౌదీ అరేబియాతో అమెరికాకు మంచి సంబంధాలు లేవు. గల్ఫ్ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటు దారుల విషయంలో అమెరికా ప్రవర్తన నచ్చట్లేదని సౌదీరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కినుక వహించినట్టు సమాచారం.