సేవ్ నల్లమల.. మైక్ టీవీలో వరుస కథనాలు..  - MicTv.in - Telugu News
mictv telugu

సేవ్ నల్లమల.. మైక్ టీవీలో వరుస కథనాలు.. 

September 13, 2019

అడవుల విధ్వంసం వల్ల ప్రకృతికి, మానవాళికి ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విచక్షణా రహితంగా చెట్ల నరికివేత, మైనింగ్, కమ్యూనికేషన్ల కోసమంటూ రోడ్లు, రైలు మార్గాలు.. మరెన్నో రకాలుగా మనిషి అడవి గుండెల్లో గునపాలు దింపుతున్నాడు. అందుకు ఫలితాలనూ అనుభవిస్తున్నాడు. కరువు కాటకాలు, వరదలు, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, రేడియేషన్.. నానా రకాలుగా కర్మఫలితాన్ని అనుభవిస్తున్నాడు. అందుకే తెలుగు ప్రజలు ఏకతాటికి వచ్చి ‘సేవ్ నల్లమల’ అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. యురేనియం తవ్వకాలతో  పచ్చని అడవులను నాశనం చేయొద్దని, అక్కడి చెంచు, ఇతర గిరిజనుల బతుకు తెరువుకు గండి కొట్టొద్దని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో మైక్ టీవీ నల్లమల్ల అడవుల ముఖచిత్రంపై అధ్యయనం నిర్వహించింది. తన సిబ్బందిని ఆ దట్టమైన అడవుల్లోకి పంపి క్షేత్రస్థాయి వాస్తవాలేంటో తెలుసుకుంది. స్థానికుల గుండె చప్పుడు వినింది. ఎంతో శ్రమకోర్చి నల్లమల సౌందర్యాన్ని, యురేనియం తవ్వకం వ్యహారంపై దాన్ని ఆగ్రహాన్ని చిత్రీకరించింది. నల్లమల బతుకు చిత్రాన్ని పరిచయం చేసే వరుస కథనాలను మైక్ టీవీ మీకు అందిస్తుంది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని చూసేయండి..