Sawant's petition in the Supreme Court to make him the indian President
mictv telugu

రాష్ట్రపతిగా చేయమని సుప్రీంలో పిటిషన్.. రియాక్షన్ ఎలా ఉందంటే

October 21, 2022

Sawant's petition in the Supreme Court to make him the indian President

కోర్టులకు సమస్యలు, వివాదాలు తీర్చాలని కక్షిదారులు, బాధితులు పిటిషన్లు వేస్తుంటారు. అయితే ఈ మాటున కొందరు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కీలకమైన కేసులపై విచారణతో ఎంతో బిజీగా ఉండే న్యాయమూర్తుల సమయాన్ని వృథా చేస్తుంటారు.

ఈ కోవలోకి మరో పిటిషన్ వచ్చి చేరింది. అయితే దీన్ని వింతల్లోకెల్లా వింత అని చెప్పవచ్చు. తనను తాను పర్యావరణ వేత్త అని చెప్పుకునే కిశోర్ జగన్నాథ్ సావంత్ అనే వ్యక్తి ఏకంగా తనను రాష్ట్రపతిని చేయమని సుప్రీంకోర్టును కోరాడు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించలేదని వాపోయాడు. అంతేకాక, కోర్టు ముందు స్వయంగా హాజరయి తనను తాను ప్రపంచ సమస్యల పరిష్కారానికి పాటు పడతానని విన్నవించుకున్నాడు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ అంతే ఘాటుగా స్పందించారు. ఇదొక దిక్కుమాలిన పిటిషన్ అని, సుప్రీంకోర్టు విధివిధానాలను అవహేళన చేసేలా ఉందని ఆగ్రహించింది. పర్యావరణవేత్తగా చెప్పుకునే ఇతను ఇలాంటి ప్రసంగాలు ఎన్నో ఇవ్వగలడని, మరోసారి ఇలాంటి పిటిషన్‌తో వస్తే అనుమతించవద్దని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. అంతేకాక, పిటిషన్‌లో పేర్కొన్న అసంబద్ధ అంశాలను రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించింది.