ఎస్బీఐ.. ఏటీఎంలో నెలకు 12 సార్లు ఉచితం
దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తోంది. స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడుసార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేయాలట. ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు అదనంగా జీఎస్టీ చెల్లిస్తూ, రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది. 1 అక్టోబర్ 2019 నుంచి ఈ నిబంధనలను ఎస్‌బీఐ అమలుపరుస్తోంది. ఇక చెక్‌బుక్ విషయానికి వస్తే చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి రావొచ్చు.
నాన్ మెట్రో ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో 12 లావాదేవీలు నిర్వహించొచ్చు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎం అయితే 5 లావాదేవీలు మాత్రమే ఉచితంగా వుంటాయి. ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితంగా అందించనుంది. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ ఫెసిలిటీ ఉండనుంది. అదే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఈ సేవలు పొందాలంటే చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే ఏటీఎంల సంఖ్య ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో 10కి పెరగనున్నాయి. బ్యాంక్ వద్ద శాలరీ అకౌంట్ కలిగిన ఉద్యోగులు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ పని చేస్తున్నాయి.