SBI క్రెడిట్ కార్డ్‌పై బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

SBI క్రెడిట్ కార్డ్‌పై బంపర్ ఆఫర్

May 26, 2020

hn vnb

లాక్‌డౌన్ దెబ్బతో కొనుగోళ్లు పడిపోయాయి. చాలా మంది చేతిలో డబ్బులు లేక ఎటువంటి విక్రయాలు చేయడం లేదు. ప్రధానంగా ఈ కామర్స్‌ల్లోనూ వస్తువులు కొనడం గణనీయంగా తగ్గింది. దీంతో వినియోగదారుల కోసం SBI సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. SBI క్రెడిట్ కార్డుతో అమెజాన్‌లో కొనుగోళ్లు జరిపితే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తామని తెలిపింది. రూ. 5 వేలకు పైగా కొనుగోలు చేసిన వారికి ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.   

మే 26 నుంచి మే 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఎంపిక చేసిన వస్తువులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. దీనితో పాటు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పైనా ఈ ఆఫర్ పొందొచ్చని సూచించింది. దీంట్లో దాదాపు రూ. 1000 వరకు కూడా క్యాష్ పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్, నోకాస్ట్ ఈఎంఐ పైనా కూడా క్యాష్ బ్యాక్ ఇస్తామని తెలిపింది. కార్పొరేట్ కార్డులు, డెబిట్ కార్డులకు ఈ ఆఫర్ వర్తించదని తెలిపింది. వెంటనే SBI క్రెడిట్ కార్డులు ఉన్నవారు ఈ ఆఫర్ వినియోగించుకోవాలని సూచించింది.