ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా.? ఈ ఆఫర్ కొట్టేయండి - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా.? ఈ ఆఫర్ కొట్టేయండి

October 9, 2019

  SBI .

ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆ బ్యాంకు శుభవార్తను విపిపించింది. దీపావళి సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. తమ కార్డు ద్వారా ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంతగా గిఫ్ట్‌లు గెలుచుకునే అవకాశాన్ని కల్పించింది. దీనికి కోసం వివిధ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. కేటగిరిల వారిగా బహుమతులను అందజేయనున్నారు. 

తమ వినియోగదారులకు గంట గంటకూ నగదు బహుమతితోపాటు అధిక మొత్తంలో ఖర్చు చేసిన వారికి లక్ష రూపాయల విలువైన ‘మేక్‌ మై ట్రిప్‌’ హాలిడే ఓచర్‌ను అందిస్తామని ప్రకటిచింది. అంతే కాదు వారానికి ఓసారి విలువైన గిఫ్ట్‌లు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రవేశపెట్టారు. రోజు వారి గిఫ్ట్‌ల్లో రూ. 7 వేల విలువైన ఇయర్‌ఫోన్స్‌, ఇలా రకరకాల బహుమతులు ఇవ్వనున్నారు. వీక్లి గిఫ్ట్‌లలో రూ.17,500 విలువైన షియోమి స్మార్ట్‌ ఫోన్లను అందించనున్నారు. అక్టోబరు 30వ తేదీ వరకు ఈ ఆఫర్‌ అమలులో ఉండనుంది. దీనితో పాటు ఇప్పటికే ఈ కామర్స్ దిగ్గజాలు ప్లిప్ కార్ట్, అమేజాన్ 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నాయి.