SBI has joined the 5 trillion club
mictv telugu

ఎస్బీఐ కొత్త రికార్డ్.. 5 లక్షల కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ

September 14, 2022

ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన మైలురాయికి చేరుకుంది. మార్కెట్ పరంగా 5 ట్రిలియన్ల (5 లక్షల కోట్లు) మార్క్‌కి చేరుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. మొత్తం బ్యాంకుల్లో మూడో స్థానంలో నిలవగా, మొదటి రెండు స్థానాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ నిలిచాయి. టాప్ టెన్‌లో చూస్తే ఏడో స్థానంలో ఎస్బీఐ ఉంది. బుధవారం ట్రేడింగ్‌లో బ్యాంక్ షేరు 1 శాతం లాభపడడంతో ఈ అరుదైన ఘనతను సాధించింది. ఈ మధ్య ఎస్బీఐ షేర్లు మంచి లాభాలను ఆర్జిస్తున్నాయి. గతేడాది 22 శాతం పెరుగగా, ఈ ఏడాది గడచిన మూడు నెలల్లోనే 26 శాతం మేర ఎగసింది. బుధవారం గరిష్ట ధర రూ. 5664.45 కి చేరింది. ఇందుకు ప్రధాన కారణం రుణాల్లో వృద్ధి అని ఆర్బీఐ డేటా చెప్తోంది. గడచిన ఐదు సెషన్లలో ఐసీఐసీఐ 5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.5 శాతం చొప్పున రాణించాయి. కాగా, మార్కెట్ విలువ పరంగా మొదటి స్థానంలో రిలయన్స్, రెండో స్థానంలో టీసీఎస్ ఉన్నాయి.