SBI hikes MCLR for various tenures by 20 bps; third hike in three months
mictv telugu

ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న ఈఎంఐల బాదుడు

August 15, 2022

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ(SBI) పంద్రాగస్టు నాడు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటును(MCLR)ను పెంచుతున్నట్టు ప్రకటించింది. నేటి నుంచే పెంచిన లెండింగ్ రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీంతో ఎంసీఎల్ఆర్‌పై రుణాలు పొందిన వారు ఇక నుంచి ప్రతి నెలా ఈఎంఐలను అత్యధికంగా చెల్లించాల్సి ఉంటుంది. MCLR మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ఆధారంగా రుణం తీసుకున్న వారు, వారు మరింత వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. వారి EMI మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది.

మూడు నెలలకు గాను ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను 7.15 శాతం నుంచి 7.35 శాతానికి పెంచారు. అదేవిధంగా, ఆరు నెలల MCLR 7.45% నుండి 7.65%, ఒక సంవత్సరం MCLR 7.5 నుండి 7.7%, రెండు సంవత్సరాల MCLR 7.7% నుండి 7.9%, మూడు సంవత్సరాల MCLR 7.8% నుండి 8% వరకు పెంచింది. ఎంసీఎల్‌ఆర్‌తోపాటు ఈబీఎల్‌ఆర్‌ మరియు రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేట్‌ని కూడా 50 బేసిస్‌ పాయింట్లు పెంచింది. గత నెలలో కూడా ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఎస్‌బీఐ వడ్డీ రేట్లు పెరగటం గత మూడు నెలల్లో ఇది మూడోసారి.