ఎస్‌బీఐలో 2 వేల కొలువులు.. నేటి నుంచే దరఖాస్తు - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్‌బీఐలో 2 వేల కొలువులు.. నేటి నుంచే దరఖాస్తు

April 21, 2018

దేశంలో అతిపెద్ద బ్యాంకు.. అందులో కొలువు.. ఎవరికి ఇష్టం ఉండదు? ఉద్యోగార్థులందరికీ ఇష్టమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో 2 వేల కొలువుల భర్తీ కసరత్తు ప్రారంభమైంది. ప్రొబెషనరీ ఆఫీసర్ల (పీవో) ఉద్యోగాలకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ ద్వారా మే నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది.

ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలతో పాటు గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమినరీలా పాసైతే, మెయిన్స్‌కు అర్హత వస్తుంది. మెయిన్స్‌ పాసైతే ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆసక్తి ఉన్న వారు bank.sbi/careers లేదా sbi.co.in/careers వెబ్‌సైట్‌ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.