SBI Recruitment for 5008 Junior Associate Posts Open, Here's How to Apply
mictv telugu

ఎస్‌బీఐ లో 5008 ఉద్యోగాలు .. డిగ్రీ అర్హతతో

September 9, 2022

దేశవ్యాప్తంగా భారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5008 రెగ్యులర్ ఖాళీలతో పాటు 478 బ్యాక్‌లాగ్ పోస్టుల్ని(జూనియర్ అసోసియేట్ పోస్టులు)భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల (సెప్టెంబర్) 27 అప్లై చేసేందుకు చివర తేది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగనుంది. ఇవి డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులే. అభ్యర్ధుల వయస్సు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు 5008 కాగా.. ఇందులో జనరల్‌ 2143, ఈడబ్ల్యూఎస్‌ 490, ఓబీసీ 1165, ఎస్సీ 743, ఎస్టీ 467 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగతా వారు అప్లికేషన్‌ ఫీజు కింద రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ నవంబర్‌ నెలలో జరుగనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://sbi.co.in/ పరిశీలించగలరు.