Home > Featured > SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఎలాంటి ఛార్జీల్లేవ్

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఎలాంటి ఛార్జీల్లేవ్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు అతిపెద్ద ఊరటనిచ్చింది. మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్లపై ఉన్న ఎస్‌ఎంఎస్ ఛార్జీలను( SMS charges) పూర్తిగా తొలగిస్తున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. కస్టమర్లు ఇక నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే.. USSD సర్వీసులను వాడుకుంటూ డబ్బులను సౌకర్యవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని బ్యాంకు ప్రకటించింది.

యూజర్లపై ఇక నుంచి తక్కువ భారాన్ని విధించనున్నామని, మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్లు మరింత అఫర్డబుల్‌గా అందుబాటులోకి రానున్నాయని బ్యాంకు ప్రకటించింది. ‘‘మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్లపై ఉన్న ఎస్ఎంఎస్ ఛార్జీలను మాఫీ చేశాం. ఇక నుంచి యూజర్లు ఎలాంటి అదనపు ఛార్జీలను భరించకుండానే ఈ లావాదేవీలను చేసుకోవచ్చు’’ అని ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. దీనికి సంబంధించిన ఒక ఇన్ఫోగ్రాఫిక్‌ను కూడా ఎస్‌బీఐ షేర్ చేసింది.

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలు కూడా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా ప్రస్తుతం ఎస్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. ఈ ఛార్జీలను ఎత్తివేయడం ద్వారా వారు మొబైల్ బ్యాంకింగ్ ను మరింత వాడేలా ప్రోత్సహిస్తోంది.

Updated : 18 Sep 2022 12:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top